తన తీరు మార్చుకున్నానని సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించే సంప్రదాయానికి స్వస్తి పలికానని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానని నేతలు, అధికారులను స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, హెచ్‌ఓడీలు, కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నట్లు చెప్పారు. వారందరినీ ఆ స్థితి నుంచి బయటపడేలా చేయాలని, 4pని అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిదులు రాబట్టే అంశాలపై సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
ప్రభుత్వ సమీక్షలన్నీ నిర్దేశిత సమయంలోనే పూర్తి కావాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు వినూత్న ఆలోచనలు చేయాలని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పిట్టాలని అన్నారు చంద్రబాబు(Chandrababu). కేంద్రం నంచి తెచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వివరించారు. పరిపాలనలో భాగంగా అధికారులకు 100శాతం మద్దతు ఉంటుందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠినంగా ఉంటానని హెచ్చరించారు.