ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

-

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన వీరిద్దరూ ఇప్పుడు ఒకే సభలో పక్కపక్కనే నవ్వుతూ కనిపించారు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. వీరు ముగ్గురు నవ్వుతూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులను అలరించింది.

- Advertisement -

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. ఆయన గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని పేర్కొన్నారు. తామిద్దరం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇన్నాళ్లకు రాజంపేట ద్వారా తమ కాంబినేషన్ కుదిరిందని చమత్కరించారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా వైఎస్పార్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో అసెంబ్లీలో సభానాయకుడిగా కిరణ్ కుమార్, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...