Chandrababu Naidu Celebrates Sankranti in Naravari Palle: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు మూడేళ్ల తర్వాత స్వగ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా నారావారి పల్లికి నారా ఫ్యామిలీ అంతా చేరుకుంది. వీరితోపాటు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా నారావారిపల్లి లో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యింది. సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం భోగిమంటలకు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. భోగిమంటల్లో పాత వస్తువులు పనికిరాని వస్తువులు వేయడం ఆనవాయితీ. మరి చంద్రబాబు నాయుడు భోగిమంటల్లో ఏం వేశారో తెలిస్తే వైసిపి నాయకులు భగ్గుమనడం ఖాయం. వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-1 పత్రాలను ఆయన భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.
కాగా చంద్రబాబు(Chandrababu Naidu) నిర్వహించిన రోడ్ షోలలో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీ ప్రభుత్వం సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెంబర్1 తీసుకొచ్చింది. అనుమతి లేకుండా సభలు, నరోడ్ షోలు నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా జీవో వన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ, ఈ చీకటి జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు జనవరి 23 వరకు జీవో 1 ను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.