ఉండవల్లి చేరుకుని ఎమోషనల్ అయిన చంద్రబాబు

-

ఇవాళ ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 53 రోజుల తర్వాత ఆయనను దగ్గరగా చూసిన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. వారిని చూసి చంద్రబాబు కూడా కంటతడి పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్విగ్నభరిత వాతావరణం చోటుచేసుకుంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, యార్లగడ్డ వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, ఇతర ముఖ్యనేతలు బాబు ఇంటి వద్ద కనిపించారు.

- Advertisement -

స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4గంటలకు చంద్రబాబు(Chandrababu) రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రి నుంచి ఉండవల్లికి రోడ్డు మార్గాన చేరుకోవడానికి దాదాపు 13గంటలకు పైగా సమయం పట్టింది. దారిపొడవునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. దీంతో బాబు కాన్వాయ్ నెమ్మదిగా కదులుతూ ముందుకు సాగింది. ఎట్టకేలకు ఈరోజు ఉదయం 6గంటలకు ఆయన ఉండవల్లి చేరుకున్నారు. అనంతరం అర్చకులు గుమ్మడికాయలు కొట్టి, హారతులు పట్టి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

Read Also: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 22 మందికి గాయాలు

Follow us on:  Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

CM Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి(CM Revanth...

Telangana Ministers | తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు..

Telangana Ministers | కొత్త ప్రభుత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...