నా ఆరోగ్య రహస్యం అదే: చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు తన ఆరోగ్య రహస్యం గురించి తొలిసారి స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మహిళలతో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఓ మహిళ చంద్రబాబును ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.

- Advertisement -

“సార్… మిమ్మల్ని మేం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పటికీ అలాగే ఉత్సాహంగా ఉన్నారు. నేటికీ మీరు అలుపెరగకుండా పనిచేస్తుంటారు. ఇది ఎలా సాధ్యం?” అంటూ ప్రశ్నించింది. దాంతో చంద్రబాబు తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు.

ఆయన ఏం చెప్పారంటే..

మనం చేసే పనిలో ఆనందం పొందాలి. నేను ప్రజల కోసం పనిచేస్తాను. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఆనందంతో ఉత్సాహం రెట్టింపవుతుంది, ఎనర్జీ లెవల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే నేను ఉదయం నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటాను. రాత్రివేళ నిద్ర పోవాలి కాబట్టి నిద్ర పోతాను తప్ప నాకు అలసట అనేది ఉండదు. నిద్రపోవడం వల్ల బ్యాటరీ మాదిరిగా రీచార్జ్ అవుతాను.

తినే తిండి… ఇది కూడా చాలా ముఖ్యమైనది. మనందరం భోంచేస్తుంటాం. అయితే ఆ తినే ఆహారం పోషక విలువలతో కూడుకున్నదై ఉండాలి. అది కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి తగిన శక్తి అందుతుంది… మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.

మన శరీరానికి కావాల్సింది… పౌష్టికాహారం. మితంగా కార్బోహైడ్రేట్లు కావాలి… ప్రొటీన్లు కావాలి, విటమిన్లు కావాలి… వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరమే. వీటన్నింటిని తగు మోతాదులో శరీరానికి అందేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...