రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 

-

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతికోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 45ఏళ్లు నిప్పులా బతికా.. నేను ఏ తప్పూ చేయలేదు అని పేర్కొన్నారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు.

- Advertisement -

జగన్.. సైకో మాత్రమే కాదు.. కరడుగట్టిన సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం అరాచకాలపై పోరాటం చేస్తున్న తనను అరెస్టు చేస్తారోమో అంటూ బాబు వ్యాఖ్యానించారు. కురుక్షేత్రం, రామాయణంలో ధర్మం గెలిచినట్లు టీడీపీ గెలుస్తుందన్నారు. అరాచక పాలన అంతంకోసం ఇంటికి ఒకరు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా అని ప్రశ్నించారు.

పుంగనూరులో వైసీపీ నాయకులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారని.. తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన వార్తల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...