ఇండియా పేరు మార్పుపై జై శంకర్‌ క్లారిటీ 

-

ఇండియా పేరు మార్పుపై దుమారం రేగుతోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌ గా మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లు సైతం ప్రవేశపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగమంత్రి ఎస్‌. జై శంకర్‌ ఇండియా పేరు మార్పుపై స్పందించారు. దేశం పేరు మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఇండియా అంటేనే భారత్ అని.. అది రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉందని చెప్పారు. అందుకోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. భారత్ అనే భావనను రాజ్యాంగం సైతం ప్రతిబింబిస్తోందని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు.

- Advertisement -

మరోవైపు ఈ నెల 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో G 20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో 9న విదేశీ అతిథులు, సీఎంలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ముద్రించారు. దీనికి తోడు తాజాగా ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన ఓ లెటర్‌లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ఉంది. దీంతో పేరు మార్చడం ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 22 మధ్య జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వాదన వినిపిస్తోంది.

ఇక అటు ఇండియా కూటమి.. దేశం పేరుని మార్చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పుడు అంత హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎదురుదాడి చేస్తోంది అధికారపక్షం. బ్రిటీష్ వారు పెట్టిన పేరెందుకు.. అందుకే మార్చేస్తున్నామని కమలనాథులు వాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....