Yuvagalam | టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర నేటితో ముగియనుంది. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishana) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ-జనసేన ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. 226 రోజుల పాటు మొత్తం 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 3,132 కిలో మీటర్ల మేర లోకేష్(Nara Lokesh) పాదయాత్ర సాగింది.
ఉమ్మడి జిల్లాల వారీగా లోకేశ్ Yuvagalam పాదయాత్ర..
చిత్తూరు- 14 నియోజకవర్గాల్లో 45రోజులు577 కిలో మీటర్లు
అనంతపురం- 9 నియోజకవర్గాల్లో 23రోజులు 303 కిలో మీటర్లు
కర్నూలు- 14 నియోజకవర్గాల్లో 40రోజులు 507 కిలో మీటర్లు
కడప- 7 నియోజకవర్గాలు 16రోజులు 200 కిలో మీటర్లు
నెల్లూరు- 10 నియోజకవర్గాల్లో 31రోజులు 459 కిలో మీటర్లు
ప్రకాశం-8 నియోజకవర్గాల్లో 17రోజులు 220 కిలోమీటర్లు
గుంటూరు- 7 నియోజకవర్గాల్లో 16రోజులు 236 కిలోమీటర్లు
కృష్ణా- 6 నియోజకవర్గాల్లో 8రోజులు113 కిలోమీటర్లు
ప.గో- 8 నియోజకవర్గాల్లో 11రోజులు 225.5 కిలోమీటర్లు
తూ.గో- 9 నియోజకవర్గాల్లో 12రోజులు 178.5 కిలోమీటర్లు
విశాఖ- 5 నియోజకవర్గాల్లో 7రోజులు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.