Chandrababu press meet at mangalagiri: విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా?అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకే.. అయ్యన్నను అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనకు అయ్యన్న అరెస్టు పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉదయం 3గంటలకు వెళ్లి అయ్యన్నను అరెస్టు చేస్తారా?. కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా లాక్కెళ్తారా? అయ్యన్న ఇంటికి అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరమేంటి?. గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరిని వదిలి పెట్టేదే లేదు. రుషికొండ అంశం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేయించారు.’’ అని (Chandrababu)అన్నారు.
జగన్ ప్రభుత్వంలో సీఐడీ ఆఫీస్ టార్చర్ ఆఫీస్‌గా మారిందన్నారు. శారీరకంగా హింసిస్తారేమో.. మానసికంగా మేం బలంగా ఉన్నామని అన్నారు. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేయిస్తారా? అని మండిపడ్డారు. బాబాయిని హత్య చేయించినట్లుగా అయ్యన్నపాత్రుడు ఏమీ చేయలేదే? ధైర్యం ఉంటే జగన్ బాబాయిని హత్యచేసిన వారిని అరెస్టు చేయండి అని సవాల్ విసిరారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం ఇచ్చారని.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి చంపించారని సమాచారం ఉందని.. వాంగ్మూలంలో షర్మిల స్పష్టంగా చెప్పినా చర్యల్లేవేందుకు? అని చంద్రబాబు ప్రశ్నించారు.