Chandrababu | లోకేశ్‌కు అభినందనలు.. పవన్‌కు ధన్యవాదాలు: చంద్రబాబు

-

యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన టీడీపీ యువనేత నారా లోకేశ్‌(Nara Lokesh)ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసించారు. ‘యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేశ్‌కు అభినందనలు. టీడీపీ పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలను నిన్న జరిగిన యువగళం నవశకం చాటి చెప్పింది. టీడీపీ(TDP), జనసేన(Janasena) కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పునర్నిర్మిస్తాయి’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -

కాగా బుధవారం రాత్రి విజయనగరంలో జరిగిన యువగళం నవశకం(Yuvagalam Navasam) బహిరంగ సభలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్, లోకేశ్‌, బాలకృష్ణ(Balakrishna), ఇతర టీడీపీ, జనసేన నేతలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి జగన్‌తో పాటు వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తమ కలయిక చూసి జగన్‌కు వెన్నులో వణుకు పుడుతుందని తెలిపారు. అలాగే త్వరతోనే అమరావతి, తిరుపతిలో సభలు పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.

Chandrababu

Read Also: వైజాగ్: వలకి చిక్కిన మనుషుల్ని చంపే కాస్ట్లీ చేప విశేషాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Fennel Seeds | సోంపుతో సూపర్ ప్రయోజనాలు..

మన వంటిల్లు వైద్యశాల అని భారతదేశంలో అందరూ నమ్ముతారు. మనకు తరచుగా...

Manchu Manoj | నాకా నమ్మకం ఉంది: మనోజ్

నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ విచారణలో పాల్గొన్న మనోజ్(Manchu Manoj).. తనకు న్యాయం...