Chandrababu sensational comments: నన్ను, లోకేష్‌ని చంపేస్తారట :చంద్రబాబు

-

Chandrababu sensational comments on CM Jagan: వివేకాను చంపినంత సులువుగా నన్ను, లోకేష్‌ని చంపాలని చూస్తున్నారంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయాయిలో ఏర్పాటు చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. లండన్‌ బాబుని శాశ్వతంగా లండన్‌ పంపిస్తా.. ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకు అంటూ చంద్రబాబు హెచ్చరించారు. జగన్మోహన్‌ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశమని సీబీఎన్‌ జోస్యం చెప్పారు. బాబయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు.

- Advertisement -

గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చారనీ.. కోడి కత్తి డ్రామా ఆడారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ పోలీసుల మెడమీద కత్తి పెట్టి పని చేయిస్తున్నారన్నారు. వివేకా కేసు హైదరాబాద్‌ కోర్టుకు వెళ్లటం జగన్‌కి చెంప పెట్టు అని అన్నారు. తండ్రి హత్య కేసుపై సునీత సుప్రీం కోర్టు వరకూ వెళ్లి చేస్తున్న పోరాటాన్ని అంతా అభినందించాలన్నారు.

మరోసారి ఉన్మాదులను గెలిపిస్తే.. అమరావతి, పోలవరం ఉండవని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరంను 72 శాతం పూర్తి చేస్తే.. జగన్‌ సీఎం అయ్యాక రివర్స్‌ టెండర్‌ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేశారంటూ దుయ్యబట్టారు. పోలవరాన్ని ముంచేసి.. నేనే చేశా అంటున్నారని మండిపడ్డారు. వాళ్లు తలచుకుంటే, బాబాయిని చంపినట్లే నన్నూ చంపేస్తా అంటున్నారట.. వాళ్ల టార్గెట్‌ ఇప్పుడు లోకేష్‌ కూడా అంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు గుప్పించారు.

వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ. 2.7 లక్షల తలసరి అప్పు ఉందనీ.. మళ్లీ ఇప్పుడు మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ వెంట పోలీసులు ఉంటే.. తనకు ప్రజల మద్దతు ఉందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలనీ.. లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. తనకు కాదని Chandrababu sensational comments చేేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...