వైసీపీదే గెలుపు అంటూ ఈటీవీ పేరుతో ఫేక్ వీడియో… తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

-

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఈటీవీ ఛానల్ పేరుతో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఫేక్ పరిశ్రమను వైసీపీ తెరపైకి తెచ్చిందని అన్నారు. ఈ ఫేక్ పరిశ్రమలో భాగంగా తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారనే దుస్థితికి జగన్ దిగజారారని విమర్శించారు. ఫేక్ ప్రచారం కోసం చివరకి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను కూడా వదల్లేదన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే.. “ఏపీ ఎన్నికలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో… ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడి… 124 సీట్లతో రెండోసారి కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ… ఎన్డీయే కూటమి 51 సీట్లకే పరిమితం అవుతుందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో… గత నెలలో 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ… వైసీపీ గెలుపు ఖాయం కావడంతో ప్రచారానికి దూరంగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు?” అంటూ ఈటీవీ న్యూస్ ఛానల్ పేర్కొన్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇది ఫేక్ వీడియో అని.. తాము ఎలాంటి ప్రచారం చేయలేదని ఈటీవీ యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది.

Read Also: రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన ప్రఖ్యాత యూనివర్సిటీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...