ఏపీలో శాంతి భద్రతలపై రాష్ట్రపతి, ప్రధాని మోదీలకు చంద్రబాబు లేఖ

-

ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. తొమ్మిది పేజీలతో రాసిన ఈ లేఖలో జగన్ సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై దాడులు వివరించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యం ఖూనీ, అధికార దుర్వినియోగం, విచ్చలవిడి దోపిడీ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా జగన్‌ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశాయని విమర్శించారు.

- Advertisement -

ఇటీవల చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. అంతేకుండా తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. 2019 ఆగస్టు నుంచి మొన్నటి అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలను వివరించారు. ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం ప్రోత్సాహంతో తనపై జరుగుతున్న దాడుల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితుల కారణంగా తనకున్న విశేషాధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

ఏపీలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఎస్ఈసీ, ఏపీపీఎస్సీ చైర్మన్‌లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులు వంటి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...