నాన్ వెజ్ ప్రియులు చికెన్ తిన్నాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం కోడి ముక్క ముట్టాలంటేనే షాక్ అవుతున్నారు. కొన్ని చోట్ల కిలో చికెన్(Chicken prices) ఏకంగా రూ.350పైన పలుకుతోంది. స్కిన్ అయితే రూ.300 వరకు ఉంది. దీంతో చికెన్ కొనడానికి సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. ఈ వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. సహజంగానే ఎండల ధాటికి కోళ్ల ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. ఎండవేడిమిని తట్టుకోలేక కోళ్లు చనిపోతుంటాయి. వేసవిలో కోళ్లు మేత తక్కువగా తీసుకుని.. నీళ్లు ఎక్కువగా తాగుతుంటాయి. దీంతో కోళ్లు పెద్దగా బరువు పెరగవు. దీనికి తోడు కోళ్ల దాణాలో ఉపయోగించే మొక్కజొన్న రేటు కూడా పెరిగిపోయిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ రేటు(Chicken prices) అమాంతం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఎండలు తాగే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
Chicken prices | కొండెక్కిన చికెన్ ధర.. కేజీ రూ.350
-