తన తమ్ముడు పవన్‌కే భవిష్యత్తులో మద్దతు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గాడ్ ఫాదర్ సినిమాకు మాతృక అయిన లూసిఫర్ కథ ఆధారంగానే డైలాగులు ఉన్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు. నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు అన్న డైలాగ్ విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను అని చిరంజీవి అన్నారు. రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయ్యి.. సైలెంట్‌గా ఉండటమే మా తమ్ముడికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాని చిరు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకితభావం కలిగిన నాయకుడు అవసరమని ప్రజలు అనుకుంటే.. పవన్‌కు ప్రజలే అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నా మద్దతు నా తమ్ముడికే అని స్ట్రాంగ్‌గా నేను ఎక్కడా చెప్పలేదు.. అతను నా తమ్ముడు. నా తమ్ముడులోని నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎక్కడా పొల్యూట్ కాలేదు.. అంతటి నిబద్ధత ఉన్న నాయకులు మనకు రావాలి. వాడు ఏ పక్షాన ఉంటాడు.. ఎటుంటాడు, ఎలా ఉంటాడనేది.. భవిష్యత్‌లో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ప్రజలు అవకాశం ఇస్తారేమో.. ఏని నేను భావిస్తున్నాను.. అటువంటి రోజు రావాలని కోరుకుంటున్నాని చిరంజీవి అన్నారు.