మీ నాన్న చెప్పిందే నేను చెప్పా.. అందులో తప్పేముంది?

-

మెదక్‌ జిల్లాలో తనపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైయస్‌ షర్మిళ స్పందించారు. అవినీతి, కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యేకు స్వయాన తండ్రే చెప్పారని షర్మిల గుర్తు చేశారు. అదే విషయాన్ని నేను చెప్తే నామీద కేసు వేశావు.. మరి తండ్రిపై కూడా కేసు పెడతారా అంటూ ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను నిలదీశారు. నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు.. చేసిన అవినీతిని నేను ఎత్తి చూపితే తప్పా అని ప్రశ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ.. అని మీ నాన్నే చెప్పారు కదా అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జోగిపేట బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ కాదు.. కంత్రి కిరణ్‌ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. జర్నలిస్టు స్థాయి నుంచి ఎమ్మెల్యే అయినా.. ఏనాడు జర్నిలిస్టుల కోసం పోరాడలేదన్నారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే.. ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది అని షర్మిల నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....