చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు అయిన నాన్ పొలిటికల్ ఏజేసీ కన్వీనర్‌కు రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో అందజేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా విసాఖపట్నంలో భారీ ర్యాలీను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. ముమ్మాటికీ అమరావతిని మేము వ్యతిరేకిస్తామని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధినే మేము కోరుకుంటున్నామనీ.. వికేంద్రీకరణ కోసమే తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. కాగా మూడు రాజధానుల కోసం అవసరం అయితే రాజీనామా చేస్తామని అవంతి శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను సమర్పించటంతో, మరింత మంది ఎమ్మెల్యేలు త్వరలోనే రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా
-