సీఆర్‌డీఏ ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ(Former Minister Narayana)కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 41A కింద నోటీసులు ఇచ్చింది. నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవి, పిల్లలకూ నోటీసులు అందించింది. మార్చి 6వ తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు 7 లేదా 8వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలపైనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.