సంక్రాంతి వేళ Cleartrip లో అత్యధికంగా బుక్కైన ఫ్లైట్ టికెట్స్

-

Cleartrip: సంక్రాంతి పండుగ వేళ, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీఏ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన , క్లియర్‌ట్రిప్‌ విమాన బుకింగ్స్‌ పరంగా అత్యధిక వృద్ధిని జనవరి 2023లో విశాఖపట్నం నగరం చూసింది. దక్షిణ భారతదేశంలో అత్యధిక టిక్కెట్ల బుకింగ్స్‌ ఈ నగరానికి జరిగాయి. ఆఫ్‌ సీజన్‌గా భావించే నవంబర్‌ 2022తో పోలిస్తే బెంగళూరు నుంచి విశాఖపట్నంకు ఈ టిక్కెట్ల బుకింగ్‌పరంగా 130% వృద్ధి కనిపించింది. ఇదే రీతిలో న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నంకు టిక్కెట్ల బుకింగ్‌ పరంగా 87% వృద్ధి నమోదైతే , కోల్‌కతా నుంచి 48% మరియు చెన్నై నుంచి 33% వృద్ధి బుకింగ్స్‌ పరంగా కనిపించింది.

- Advertisement -

క్లియర్‌ట్రిప్‌(Cleartrip) చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రహ్లాద్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘‘ అత్యంత అందమైన బీచ్‌లు , బొర్రా గుహలు లాంటి వినూత్నమైన ఆకర్షణలకు తోడు సబ్‌మెరైన్‌ మ్యూజియం వంటి ఆకర్షణలతో ఈ నౌకానగరం అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతంగా సంవత్సరమంతా యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అయితే, సంక్రాంతి వేళ, సంప్రదాయ పండుగులు, విభిన్నమైన రుచులు, తారాస్ధాయికి చేరిన ఉత్సాహానికి కేంద్రంగా వైజాగ్‌ మారిపోతుంది. తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలలో పాల్గొనడానికి లేదంటే మొట్టమొదటిసారిగా ఈ మెట్రోపాలిస్‌ నగరాన్ని అన్వేషించడం కోసం ఈ నగరానికి చాలామంది వెళ్తుంటారు. ఈ పండుగ సీజన్‌ సమయంలో వారికి ఆనందానుభూతులను కల్పిస్తూ అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడే ఓ వేదికను అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము.

సంవత్సరాంతపు సెలవుల సీజన్‌ ముగిసిన తరువాత కూడా యాత్రలు చేయాలనే అభిరుచి పెరుగుతుండటం, జనవరిలో కూడా ఆ ఆసక్తి కొనసాగుతుండటం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...