ఏపీలో నామినేటెడ్ పదవులు(Nominated Posts) పొందిన 59 మందికి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. దాదాపు 30 వేల దరఖాస్తులు పరిశీలించామని… పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన పార్టీ నేతలు కార్యకర్తలు మహిళలు యువతకు అవకాశం కల్పించామని చెప్పారు.
కాగా, ఏపీ ప్రభుత్వం శనివారం రెండో విడత నామినేటెడ్ పోస్టులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. వైసిపి హయాంలో వేధింపులకు గురైన వారికి, పార్టీ కోసం కష్టపడిన బూత్ స్థాయి కార్యకర్తలకు టిడిపి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో(Nominated Posts) అవకాశం కల్పించింది. మొదటి విడతలు 20 కార్పొరేషన్లకు చైర్మన్ ల తో పాటు సభ్యులు, డైరెక్టర్లు కలిపి మొత్తం 99 మందికి అవకాశం కల్పించగా.. రెండో విడతలో 59 మందిని పదవులు వరించాయి.