CM Jagan Review Meeting Agriculture and grain Collection: వ్యవసాయం, ధాన్యం సేకరణపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని సీఎం జగన్ పేర్కొన్నారు. సోమవారం వ్యవసాయం, ధాన్యం సేకరణ, కొనుగోలు ఆంశల పై సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలన్నారు.
వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ కొనసాగాలన్నారు. తక్కువ ధరలకే.. పంటను అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట రైతుల నుంచి రాకూడదని తెలిపారు. రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని ఆదేశించారు. ఈ భూసార పరీక్షల వల్ల ఏ ఎరువులు వాడాలి? అనే దానిపై స్పష్టత వస్తుందని సీఎం జగన్ (CM Jagan) అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖమంత్రి కాకాణి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.