ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లోకి కొత్తగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఆంకాలజీలో 32, సర్జికల్ ఆంకాలజీలో 10, రేడియేషన్ ఆంకాలజీలో 4 చికిత్సలను ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో శాశ్వతంగా చేర్చింది. వీటిని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేదంటూ ఉపశమనం కలిగించింది. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్(CM Jagan)కు కృతజ్ఞతలు చెప్పారు. హెల్త్ కార్డు కలిగిన ఉద్యోగులందరూ కొత్తగా చేర్చిన క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన వైద్య సేవలను అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులలో పొందవచ్చు. పూర్తి వివరాల కోసం www.ysraarogyasri.ap.gov.in లింక్‌ను ఓపెన్ చేసి తెసుకోవచ్చు.
Read Also: యువతి ప్రేమ పంచాయితీ.. మేనమామ దారుణ హత్య
Follow us on: Google News, Koo, Twitter