కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో జైరాం రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18న కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి రాహుల్ పాదయాత్ర చేరనుందని వెల్లడించారు. భారత్ జోడో యాత్రపై బీజేపీ, దాని మిత్రపక్షాలు విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ యాత్రకు వస్తున్న స్పందన చూసి, వారు భయపడుతున్నారని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు జోడో యాత్ర సంజీవిని లాంటిదనీ.. ఈ యాత్రతో కాంగ్రెస్ బలపడుతుందని జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రత్యేక హోదా ఇస్తాం: జైరాం రమేష్
-