Loan apps:లోన్ యాప్‌ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, 600 రుణ యాప్‌లు (Loan apps) చట్ట విరుద్ధంగా ఉన్నాయనీ, వాటి వివరాలను ఆర్బీఐ వెబ్ సైట్‌లో చూడవచ్చునని అన్నారు. ఈ యాప్‌ల ద్వారా తక్కువ ఆదాయం వచ్చే వారే లక్ష్యంగా, అప్పులు ఇచ్చి.. అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వివరించారు. లోన్లు ఇచ్చి, బ్లాక్ మెయిల్ చేసి, ఇచ్చిన లోన్ మెుత్తం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని వెల్లడించారు. లోన్ యాప్స్‌ను (Loan apps) డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకపోతే, ఫోన్‌లో ఉండే కాంటాక్ట్స్, కెమెరా లొకేషన్, స్టోరేజీ ఎస్‌ఎమ్‌ఎస్ అనుమతులు అడిగి వ్యక్తిగత సమచారాన్ని దొంగలిస్తారని హెచ్చరించారు. తప్పని పరిస్థితుల్లో లోన్ యాప్స్ ద్వారా రుణం పొంది, లోన్ మెుత్తం చెల్లించినా.. ఇబ్బందులకు గురి చేస్తే.. టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బెదిరింపు కాల్స్, ఫోటో మార్ఫింగ్‌కు భయపడి అధిక మెుత్తాలను చెల్లించవద్దని తెలిపారు. లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు.
Read also: పండ్లు తిని నీళ్లు తాగుతున్నారా..? చాలా డేంజర్