Dharmana Prasada Rao: రియల్‌ ఎస్టేట్‌ కోసమే చంద్రబాబు అమరావతిని సృష్టించారు

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao sensational comments on Chandrababu Naidu: ఏపీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ కోసమే చంద్రబాబు అమరావతిని సృష్టించారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర డబ్బంతా హైదరాబాద్‌లో పెట్టారు.. వాళ్లు వెళ్లిపొమ్మన్నారు.. రేపు రాష్ట్ర సంపదంతా అమరావతిలో పెడితే.. వారు కూడా వెళ్లిపొమ్మంటే.. ఏం చేస్తాం అని ప్రశ్నించారు. అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన విశాఖని రాజధానిగా చంద్రబాబు వద్దంటున్నారని మండిపడ్డారు. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా యాత్ర మెుదలుపెట్టారు.. కానీ ప్రజల తిరుగుబాటు చూసి తోక ముడిచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. యాత్ర మానేసి.. అక్కడ ఇక్కడ అన్యాయం అయిపోయిందంటూ చంద్రబాబు అంటున్నారన్నారు. అన్యాయాలకి అడ్రస్‌ టీడీపీ, చంద్రబాబులే అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలపై ఆరోపణలు చేస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలను కొనసాగిస్తునంటున్న చంద్రబాబు.. ఇదేం మాయమాటలు అంటూ నిలదీశారు. అందర్నీ కూడగట్టి.. అధికారంలోకి రావాలని చంద్రబాబు అనుకుంటున్నారు కానీ.. అది సాధ్యం కాదని మంత్రి ధర్మాన (Dharmana Prasada Rao) జోస్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here