ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య(Viveka Murder) కేసును ప్రస్తావిస్తున్నారు. కడపలో ప్రచారం చేస్తున్న పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, సునీతా రెడ్డి ప్రధానంగా వివేకా హత్య గురించి ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా రాజకీయ నేతలు పదే పదే వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని.. తద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. షర్మిలతో పాటు చంద్రబాబు, బీజేపీ నేత పురందీశ్వరి, పవన్ కల్యాణ్, నారా లోకేష్, వైఎస్ సునీత.. వివేకా హత్య(Viveka Murder) గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.