Drugs caught in chittore: చిత్తూరులో డ్రగ్స్ కలకలం రేగింది. సూడాన్ దేశస్థుడితో కలిపి.. మరో ఐదుగురు డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులోని ఇరువారం జంక్షన్ వద్ద బాలత్రిపుర సుందరి ఆలయం వద్ద మెుత్తం ఎనిమిది మంది డ్రగ్స్‌ను అమ్మేందుకు డ్రగ్స్ పొట్లాలను పంచుకుంటుండగా.. పోలీసులు దాడులు చేసి పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఇద్దరు పరారవ్వగా, ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
సుడాన్ దేశస్థుడు బెంగళూరు నుంచి వచ్చి.. ఇక్కడ డ్రగ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షలు విలువ చేస్తే 34 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పరారైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. యువత అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ వాడకానికి అలవాటు పడి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు సైతం పిల్లలను గమనిస్తూ ఉండాలని ఎస్పీ సూచించారు.