వైసీపీ ప్రభుత్వ తీరుపై తూర్పుగోదావరి(East Godavari) జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ర్యాంపు(Sand Ramps) కోసం లంక భూముల్లోని పంటలను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికే 300 ఎకరాల భూమి గోదావరిలో కలిసిపోయిందని వాపోతున్నారు. దీంతో పెరవలి మండలంలోని మూడు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వైసీపీ సర్కార్ తమకు ఉపాధి లేకుండా చేస్తోందని.. ఇసుక ర్యాంప్ ఏర్పాటును అడ్డుకున్నారు. ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
East Godavari | గతంలో టీడీపీ(TDP) ప్రభుత్వం కూడా ఇక్కడ ఇసుక ర్యాంపును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. ర్యాంపు ఏర్పాటును రైతులు నిరాకరించారు. వారి ప్రతిపాదనలు విన్న అప్పటి ప్రభుత్వం ఇసుక ర్యాంపు ఏర్పాటును విరమించుకుంది. అయితే మరోసారి అక్కడ ర్యాంపు ఏర్పాటు చేసేందుకు వైసిపి(YCP) ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అదే జరిగితే మూడు గ్రామాల్లోని దాదాపు 300 ఎకరాల పంట భూమి ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. దీంతో రైతులు ర్యాంపు ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఈరోజు కూడా నది ఒడ్డున ర్యాంపు ఏర్పాటుకి సంబంధించిన పనులను సర్కార్ స్టార్ట్ చేయడంతో రైతులు అడ్డుకున్నారు. ర్యాంపు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమంటూ సీఎం జగన్(Jagan) ని హెచ్చరించారు.