ఒక్క రాత్రిలో కోటీశ్వరుడైన కర్నూలు రైతు

Kurnool

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం పనులు ఊపందుకున్నాయి. రైతులు చకచకా సాగు పనులు ప్రారంభించారు. కర్నూలు(Kurnool ) జిల్లాలోని రైతులు తొలకరి తర్వాత చిన్నాపెద్దా తేడా లేకుండా జనం పొలాల బాట పడతారు. వ్యవసాయ పనులతో పాటు వజ్రాల కోసం కూడా వేట ప్రారంభిస్తారు. వజ్రాల కోసం ఇంటిల్లపాది పొలాలను జల్లెడ పడతారు. కర్నూలు జిల్లాలో ఇది ప్రతీ ఏడాది జరిగే తంతే. ముఖ్యంగా వజ్రకరూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు(Diamonds) తరచూ దొరకుతుండటంతో ఈ ప్రాంతంలోని పొలాలను ప్రజలు జల్లెడపడతారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే ఒక్క వజ్రంతో ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు. ఇటీవలే తొలకరి జల్లు కురియడంతో కర్నూలు(Kurnool ) జిల్లా మద్దెకర మండలంలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు అన్వేషణ మొదలుపెట్టారు. మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరకు గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం కూడా పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.

Read Also:
1. ‘సిగ్గులేకుండా డబ్బా కొట్టుకునే కేసీఆర్ ఆ బిల్లు ఎందుకు క్లియర్ చేయలేదు’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here