బోయపాటి -రామ్ పోతినేని మూవీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పండగే!

Ram Pothineni
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ మైసూర్‌లో(Mysore) ప్రారంభం కానుంది. కాగా ఈ షెడ్యూల్‌లో సాంగ్‌ను షూట్ చేయనున్నారు మేకర్స్. శ్రీ లీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్ల లోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here