ఇండియాను షేక్ చేసిన డైరెక్టర్‌కు నాటుకోడి పులుసు పంపిన NTR

NTR

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో దేశం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజున ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బర్త్ డే రోజున ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రెటీలు ప్రశాంత్‌కు విషెస్ తెలిపారు. ఇక టాలీవుడ్ నుండి రామ్ చరణ్(Ram Charan), తారక్‌లు(NTR) కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్‌కు విషెస్‌ను తెలియజేశారు. ఇక తారక్ అయితే ఏకంగా నాటు కోడి పులుసు పంపించి మరీ బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR).. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Read Also:
1. ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
2. కారులో డీజే టిల్లు-అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here