TS: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

TSLPRB

TSLPRB |తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలపై అభ్యంతరాలుంటే జూన్ 1 నుంచి జూన్ 3 వకు రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు బోర్డు కల్పించింది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాస రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ రీకౌంటింగ్‌కు మొత్తం 1338 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 3,55,387 స్క్రిప్ట్/ ఓఎంఆర్ షీట్లలో కేవలం 1338 మాత్రమే వచ్చాయని, ఇది ఒక శాతం కంటే కూడా తక్కువ అని పేర్కొన్నారు. ఈ రీకౌంటింగ్ పెట్టుకున్న అభ్యర్థుల ఫలితాలు జూన్ 6 (మంగళవారం)న వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఈ అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను వెబ్‌సైట్ లో వ్యక్తిగత లాగిన్ ద్వారా మార్కులను తెలుసుకోవచ్చని సూచించారు.

Read Also:
1. విధుల్లో చేరిన భారత రెజ్లర్లు.. అసలు ఏమైందంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here