Former Chief Minister Chandra babu tour in kurnool district: సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రోజుల కర్నూలు పర్యటనలో భాగంగా ఆయన ఓర్వకల్లు విమానాశ్రయంలో విద్యార్థులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతిని నిర్మించాలని భావించానని అన్నారు. వైసీపీ పాలన పై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అమరావతిలో రైతుల భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. గత మూడు నెలలుగా రాయలసీమ యూనివర్సిటీ సిబ్బందికి జగన్ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు.