Ganta Srinivasa Rao To Will Quits Tdp and Likely To Join in Ysrcp: ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి రాష్ట్ర అధికార పగ్గాలు చేతబట్టింది. మొదలు టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీలోని కీలక నేతలు చంద్రబాబుకు షాక్ ఇస్తూ.. టీడీపీకి గూడ్‌బై చెప్తున్న విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి గంటా పార్టీ మార్పు విషయంలో పుకార్లు వస్తూనే ఉన్నాయి. దీనికి ఆయన ఆద్యం పోసినట్టు వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకలాపాల్లో అంత యాక్టీవ్‌గా లేకపోవడంతో అందరూ గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని అనుకున్నారు. అయితే ఇప్పుడు గంటా ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారని.. డిసెంబర్‌లోనే ఆయన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది. కాగా.. పార్టీని వీడే ముందు మెగాస్టార్ చిరంజీవితో ఆయన సమావేశం కానున్నారని.. ఈక్రమంలో ఇప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. డిసెంబర్ 1న గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivasa Rao) పుట్టిన రోజు ఉంది. దీంతో ఆ వేడుకల తర్వాత వైసీపీలో చేరనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే.. ఈ పుకార్లపై గంటా లేదా టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.