సీఎం వైఎస్ జగన్‌కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) ఘాటు లేఖ రాశారు. ‘మీ నాన్నగారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. మొదట్లో ఆయనను విమర్శించినా తర్వాత ఆయన అభిమానిగా మారాను. ప్రతిపక్ష నాయకుల పట్ల ఆయన అప్పుడప్పుడు చేస్తుండే విమర్శనాస్త్రాలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరకూ తెలిసినవే. ముఖ్యమంత్రిగా ఆయన హుందాతనంలో 10వ వంతు కూడా మీకు లేవని అనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన చూస్తుంటే అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజల ఆరాధ్య నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పట్ల సీఎం వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలను లేఖలో తప్పుబట్టారు.
మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్ళిల్లు చేసుకొంటే ప్రజలకెవ్వరికీ లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి చట్టపరంగానే మరో పెళ్ళి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంచుకుంటే తప్పు కాని అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌పై బురద చల్లటానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్లు ఉంది. మరోసారి చావకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్త పెట్టుకుంటే మంచిది అని హరి రామజోగయ్య(Harirama Jogaiah) వార్నింగ్ ఇచ్చారు.
Read Also:
1. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఔట్.. ఈటలకు కీలక పదవి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat