ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు(Rain Alert) పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడవొచ్చని పేర్కొంది. శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం, విశాఖ, కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో వానలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బయటకు రావొద్దని హెచ్చరించింది.
బయటకు రావొద్దు.. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం
-