Anagani Satya Prasad | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై కూటమి సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. ఇది కచ్ఛితంగా కుట్రపూరిత ఘటనే అని నమ్ముతోంది. దీని వెనక ఎవరు ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే హెచ్చరించింది. తాజాగా ఇదే అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఈ కుట్ర వెనక ఉన్నది వెరైనా శిక్ష తప్పదని, అది జగన్ అయినా పెద్దిరెడ్డి అయినా వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సీఐడీ లోతుగా విచారణ చేస్తుందని, దర్యాప్తు వేగం కూడా పెంచిందని ఆయన చెప్పారు.
వైసీపీ హయాంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్ష నిర్వహిస్తామని కూడా అనగాని(Anagani Satya Prasad) వెల్లడించారు. ‘‘కోట్ల రూపాయలు విలువ చేసే భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారా? రెవెన్యూ ఆఫీసులోనే భద్రత కరువైన స్థితి ఏర్పడింది. మదనపల్లె ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారు అధికారులు. మనదపల్లెలో జరిగిన అన్యాయాలపై పెద్ద సంఖ్య ప్రజలు ఫిర్యాదులు ఇచ్చారు. వీటి నేపథ్యంలోనే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశాం’’ అని వెల్లడించారాయన.