Jagan | అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం

-

సీఎం జగన్(CM Jagan) ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి(Bheemili)లో ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడు కాదని అర్జునుడిని అని తెలిపారు. ఓవైపు పాండవ సైన్యం .. మరోవైపు కౌరవ సైన్యం ఉందని.. కృష్ణుడి లాంటి ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడితో పాటు ఇతరులతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

175 సీట్లలోనూ మనమే గెలుస్తు్న్నామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరో పాతికేళ్లు మన జైత్రయాత్ర కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య.. మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను నెరవేర్చామని.. ఈ ఐదేళ్లలో మనం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. విద్య, వైద్యం, పాలనా రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని.. ఈ మార్పులు ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ కనిపిస్తు్న్నాయని జగన్(Jagan) వెల్లడించారు.

Read Also: YSR పార్టీ అంటే వైవీ.. సాయిరెడ్డి.. రామకృష్ణారెడ్డి.. షర్మిల సెటైర్లు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...