రాజ్యసభ వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ(MP Mopidevi), బీద మస్తాన్ రావు(Beeda Masthan Rao).. ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ ఛర్మైన్ జగ్‌దీమ్ ధన్‌కడ్‌కు తమ రాజీనామా లేఖలను అందించారు. తాము త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు కూడా ప్రకటించారు. పార్టీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఘోర పరాజయంపై ఇప్పటి వరకు సమీక్ష కూడా నిర్వహించలేదంటూ మోపీదేవి చెప్పుకొచ్చారు. ఇప్పటికే టీడీపీలో చేరడానికి చంద్రబాబు(Chandrababu)తో చర్చలు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అతి త్వరలోనే ఎప్పుడు టీడీపీ కండువా కప్పుకునేది ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కాగా వీరి బాటలోనే మరికొందరు వైసీపీ ఎంపీలు కూడా నడవనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ(MP Mopidevi) రాజీనామాలను జగ్‌దీప్ ధన్‌కడ్ ఆమోదించారు. అంతకుముందే అన్నీ ఆలోచించుకునే రాజీనామా చేస్తున్నారా అని ధన్‌కడ్‌కు ప్రశ్నించగా.. తాము తమ మనస్ఫూర్తిగా.. ఎవరి ఒత్తిడీ లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీలు చెప్పారు. అయితే వారి రాజీనామాతో ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ ఖాళీ కానుందా అన్న అనుమానాలను అధికం చేస్తున్నాయి.