జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఏపీ మహిళా కమిషన్ షాకిచ్చింది. ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్(AP Women’s Commission) నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. రాష్ట్ర మహిళా కమిషన్‌కు సమాధానం ఇవ్వకపోతే పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని సూచించింది.
ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంతస్థాయిలో మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం వలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారమే అని ఆరోపించారు. రహస్యంగా సేకరిస్తున్న సమాచారం కొన్ని అసాంఘిక వర్గాలకు చేరుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి అని వ్యాఖ్యానించారు.
Read Also: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఊర్వశీ ఐటమ్ సాంగ్!
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat