అన్నమయ్య డ్యామ్(Annamayya Dam) బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులు చెప్పిన విధంగా డ్యాం బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడతారో..? లేదో చూస్తాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు తమ నిబద్ధతను ఎంత వరకు చాటుకుంటారో చూస్తాం. అధికారులవి కంటితుడుపు చర్యలేనని భావిస్తున్నానన్న పవన్(Pawan Kalyan).. అన్నమయ్య డ్యాం బాధితుల ఇళ్ల నిర్మాణంపై పోరాటం విషయంలో మరో నెల రోజులు వెయిట్ చేస్తామని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్నమయ్య డ్యామ్‌ను తిరిగి పూర్తిస్థాయిలో పునర్‌నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే.. కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు.
నిబద్ధతను ఎంత వరకు చాటుకుంటారో చూస్తాం: పవన్ కల్యాణ్
-