కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం

-

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) శనివారం బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మొదటిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కల్పించిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుటున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై బెంగళూరు నగర కమిషనర్‭కు సమాచారం ఇచ్చారు. సీఎం ‘జీరో ట్రాఫిక్‌(Zero Traffic)’ ప్రోటోకాల్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభించి ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిద్ధరామయ్య(Siddaramaiah) తెలిపారు. గతంలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌ను తిరస్కరించారు. 2023 మే 21 ఆదివారం రోజున కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులో ఓ యువతి మృతి చెందిన వెంటనే సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...