మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) 100వ వర్థంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆయనకు నివాళులర్పించారు. వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని తెలిపారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అని ప్రకటించారు. ఆ మహా యోధుడు వీరమరణం పొంది నేటికి వందేళ్లు అని పేర్కొన్నారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకే విప్లవ వీరుడు అల్లూరికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించి ఆయన స్ఫూర్తిని దేశమంతటా చాటాలని కోరారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తామే స్వీకరిస్తామని పవన్(Pawan Kalyan) వెల్లడించారు.
చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు – JanaSena Chief Shri @PawanKalyan#AlluriSitaRamaraju pic.twitter.com/U9QEn3GPXg
— JanaSena Party (@JanaSenaParty) May 7, 2023
Read Also: ORR కాంటాక్ట్‌లో భారీ కుంభకోణం ఉంది: కిషన్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter