Janasena | జనసేనకు తగ్గిన సీట్లు.. తేలిన పొత్తు లెక్కలు.. 

-

టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సమావేశం కొనసాగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండా, జనసేనాని పవన్ కల్యాణ్‌, చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చారు. ఈ మేరకు మూడు పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి.

- Advertisement -

టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. పొత్తు ధర్మం పాటిస్తూ జనసేన పార్టీ తనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 స్థానాలు బీజేపీకి కేటాయించగా.. టీడీపీ ఓ స్థానాన్ని వదులకుంది. ఎంపీ స్థానాలకు వస్తే అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థులు.. మిగిలిన నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....