టీడీపీ-జనసేన(Janasena TDP) పార్టీలు ఉమ్మడిగా మినీ మేనిఫెస్టోను ప్రకటించాయి. మంగళరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో టీడీపీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ సిక్స్, జనసేన ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు యనమల తెలిపారు. అలాగే వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని పూర్తి స్థాయి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని పేర్కొ్న్నారు.
Janasena TDP మినీ మేనిఫెస్టోలోని అంశాలు..
అమరావతే రాజధానిగా కొనసాగింపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ
ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు
పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం
బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం
రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం
రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన