ఏపీలో కొత్త పార్టీ పెడతా: జేడీ లక్ష్మీనారాయణ

-

ఏపీలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనాయరణ తెలిపారు. రాజకీయాల్లో యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంచేశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ విశాఖ నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు మంచి మద్దతు లభించిందని.. ఆమె కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉందన్నారు. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత కచ్చితంగా జరగాలని.. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇక డిసెంబర్ 2న జేడీ ఫౌండేషన్, నైపుణ్య అభివృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని.. సెలెక్ట్ అయిన వారికి అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన జేడీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...