ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC).ఈ నెల 8న మరో జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ జాబ్ మేళా ద్వారా ఫ్లిప్ కార్ట్(Flipkart), శ్రీ రంగ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్(Sri Ranga Motors Pvt Ltd), ఇన్ఫో పేమెంట్స్ బ్యాంక్(FINO Payments Bank) సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Job Mela | అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా https://www.apssdc.in/home/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 8న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయి. శ్రీకాకుళం పట్ణణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇతర వివరాలకు 9704960160 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ సంస్థలోని డెలివరీ బాయ్స్ విభాగంలో 103 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు శ్రీకాకుళంలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.12వేల వరకు వేతనం ఉంటుంది.
శ్రీ రంగ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోని సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి.ఇంటర్/డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12000-15000 వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు పలాసా, రాజం, పాలకొండ, శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉంటుంది.
ఇన్ఫో పేమెంట్స్ బ్యాంక్ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడాకికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.18000-రూ.25000 వరకు వేతనం ఉంటుంది.