మంత్రి ఉషశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం భేటీ

-

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు(Ushasri Charan) సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగిలింది. ఆమెకు వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గం నేతలు సమావేశమయ్యారు. మంత్రి పని తీరును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి ఇంట్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలో మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో తమను అవమానిస్తున్నారని, ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఆమె వైసీపీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అనూహ్య పరిణామాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

Read Also:
1. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ అప్‌డేట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఆసక్తికరంగా ముహమ్మద్ యూనస్‌, ప్రధాని మోదీ భేటీ

భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM...

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...