మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు చిరంజీవిని పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం కూడా చర్చకు దారి తీసింది. గుడివాడలో చిరు అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. అనంతరం గతంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపైనా క్లారిటీ ఇచ్చారు.
- Advertisement -
కొడాలి నాని ఏమన్నారంటే..
-నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి
-నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు.. మేమంతా క్లారిటీ గానే ఉన్నాం
-రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు
-జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతా
-ఎవరి జోలికి వెళ్లని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదు
-చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ(TDP), జనసేన(Janasena) శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారు
-చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది
–ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టా
-పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం
-తమకు ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పా
అయితే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఈవెంట్ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. అనంతరం కొడాలి(Kodali Nani) స్పందిస్తూ పకోడీగాళ్ల సలహాలు మాకొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ కొడాలి దిష్టి బొమ్మలు దహనం చేశారు.