అధికార వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

-

ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ముద్దనూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ ఎన్నికల్లో పి.గన్నవరం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును కాదని విప్పర్తి వేణుగోపాల్‌కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.గన్నవరం నుంచి ఆయన పోటీచేసే అవకాశం ఉంది.

- Advertisement -

చిట్టిబాబు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. “కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నమ్ముతూ అధికార వైసీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామం. ఈ క్రమంలోనే పి.గన్నవరం MLA , వైసీపీ సీనియర్ నాయకులు కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) ఈరోజు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.” అని షర్మిల ట్వీట్ చేశారు.

Read Also: తండ్రి అయిన మంచు మనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...